Tirumala Rush: తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-23 10:43:23.0  )
Tirumala Rush: తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే..
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉంటే.. నేడు 16 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారని టీటీడీ(TTD) తెలిపింది. వారాంతం కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న 63,731 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 22,890 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చింది.


Read More..

Tragic incident:అర్ధరాత్రి తల్లి, కుమారుడి దారుణ హత్య

Advertisement

Next Story