- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
దిశ, ఫీచర్స్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వస్తుంటారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి వెళ్తుంటారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. వేసవి ముగిసి వర్షాకాలం కాలం రావడంతో అందరికీ సెలవులు ముగిసినప్పటికీ.. జనాలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భారీగా వెళ్తున్నారు. దీంతో అక్కడ జనాలు పోటెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 18 గంటల సమయం పడుతుంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోవడంతో నారాయణ షెడ్ల వరకు ఎక్కడి జనం అక్కడే నిలిచి పోయారని సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన చాలామంది తిరుమలకు వెళ్లేందుకు కాస్త ఆలోచిస్తున్నారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న శ్రీవారిని 79, 584 మంది దర్శించుకోగా.. 31, 848 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక హుండీ రూ. 4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.