Big Breaking: కేశినేని నాని, కృష్ణ ప్రసాద్‌పై దేవినేని ఉమ ఫైర్

by Indraja |
Big Breaking: కేశినేని నాని, కృష్ణ ప్రసాద్‌పై దేవినేని ఉమ ఫైర్
X

దిశ వెబ్ డెస్క్: ఈరోజు ఇబ్రహీంపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కేశినేని నాని, కృష్ణ ప్రసాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడను ఉద్ధరించిన, ఇరగదీసిన అని పదేపదే చెప్పే కేశినేని నాని.. సింగపూర్ విమానం విశాఖకి చేరుకుంటే ఎందుకు మూసుకుని కూర్చున్నాడని ఎద్దేవ చేశారు. పదవులకోసం కేశినేని నాని ఎంతకైనా దిగజారతారని.. ఎంపీ బీఫారం టికెట్ కోసమే అమరావతిపై కేశినేని నాని విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షతో రాజాకీయాల్లోకి అరంగేట్రం చేసిన కేశినేని నాని.. ఈ రోజు అయన పైనే విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరుగురు ఎమ్మెల్యేలను బొందపెట్టిన ఘనత వైసీపీ నేతలకె సొంతమని.. అలాంటి నేతలతో కేశినేని నాని కలవడం ప్రజలు కూడా హర్షించరని పేర్కొన్నారు. మైలవరం టెర్రరిస్ట్ వసంత కృష్ణ ప్రసాద్ తో చెట్టాపట్టాలేసుకొని శంకుస్థాపనలు, ప్రారంభత్సవాలు చేసారని ఆరోపించిన ఆయన.. కొండపల్లి లో మున్సిపాలిటీ ఫలితాల నేపధ్యంలో కౌన్సిలర్ల మీద కుర్చీలు ఎగిరి పడుతున్న ఏమి పట్టనట్టు చెరో పక్క చిద్విలాసంగా ఎంపీ, ఎమ్మెల్యే కూర్చుని చోద్యం చూసారేతప్ప.. అడ్డుకోలేదని..దీన్ని ఏమంటారు? అని ప్రశించిన ఆయన.. ఇది రాజకీయ వ్యభిచారం కాదా? అని ప్రశ్నించారు. నిన్నటివరకు ఒకరినొకరు బూతులు తిట్టుకొని.. ఈ రోజు మూతులు నాక్కుంటే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. 2024 లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. వైసీపీ భూస్థాపితం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.



Advertisement

Next Story