కేశినేని నాని ట్రావెల్స్ నష్టాలపై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
కేశినేని నాని ట్రావెల్స్ నష్టాలపై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి, పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్‌తో భేటీ అయిన తర్వాత చంద్రబాబు, నారా లోకేశ్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మోసగాడని, తాత, తండ్రి పేర్లు చెప్పినా లోకేశ్‌ మంగళగిరిలో గెలవలేకపోయారని కేశినేని నాని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కోసం తాను ఆస్తులు, వ్యాపార సంస్థలు వదులుకున్నానని మండిపడ్డారు.

దీంతో కేశినేని నానికి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నష్టాల వల్లే ట్రావెల్స్‌ వ్యాపారాన్ని నాని వదులుకున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబుకు, టీడీపీకి వాటిని ఆపాదించడం సరికాదన్నారు. ఎంపీ పదవి కోసం కేశినేని ఇంతగా దిగజారాలా అని నిలదీశారు. చంద్రబాబు పడుతున్న కష్టాలు చూసి ఎవరెన్ని విమర్శలు చేసినా, అవమానించినా చూస్తూ ఊరుకున్నామని తెలిపారు. కానీ కేశినేని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. లోకేశ్ యువగళం కోసం యువత కదిలి వస్తుంటే కేశినేనికి కనిపించలేదా అని ప్రశ్నించారు. నిన్న, మొన్నటి వరకూ జగన్ దుర్మార్గుడిగా కనిపించిన సీఎం జగన్ ఇప్పుడు మంచి వ్యక్తి అయ్యాడా అని దేవి నేని ఉమ ప్రశ్నించారు.

Advertisement

Next Story