న్యూ ఇయర్ వేళ ఏపీలో తాగిన మద్యం ఎంతో తెలుసా?

by GSrikanth |
న్యూ ఇయర్ వేళ ఏపీలో తాగిన మద్యం ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేళ తెలంగాణ మందుబాబులు సంచలన రికార్డు క్రియేట్ చేశారు. గత రికార్డులన్నీ తిరగరాస్తూ.. మరో కొత్త రికార్డు నమోదు చేశారు. ఒక్క రోజే రూ.658 కోట్లు మందు తాగి చరిత్ర సృష్టించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్షా 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయట. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరిందట. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే చిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. మరోవైపు ఏపీలోనూ మందుబాబులు రెచ్చిపోయారు. న్యూ ఇయర్ వేళ రాష్ట్ర వ్యాప్తంగా రూ.156 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story