Pawan Kalyan:రేపు ఆ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్

by Jakkula Mamatha |   ( Updated:2024-10-20 10:06:13.0  )
Pawan Kalyan:రేపు ఆ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్
X

దిశ,వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు(సోమవారం) విజయనగరం జిల్లా గుర్ల గ్రామం లో పర్యటిస్తారు. గుర్లలో అతిసారం ప్రబలిన క్రమంలో ఆ గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితుల పై సమీక్షిస్తారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం లో డయేరియా విలయతాండవం చేస్తుంది. వాంతులు, విరేచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేపు అక్కడ పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story