‘ఏపీలోని ఆ పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక భూములు’..స్పందించిన డిప్యూటీ సీఎం పవన్!

by Jakkula Mamatha |
‘ఏపీలోని ఆ పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక భూములు’..స్పందించిన డిప్యూటీ సీఎం పవన్!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు(గురువారం) కర్ణాటకలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌లతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. అనంతరం బెంగుళూరులో డిప్యూటీ సీఎం పవన్ మీడియాతో మాట్లాడారు.

తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్ర భూములు ఉన్నాయని, వాటి రెన్యువల్‌కు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ, అవి భారతదేశం మొత్తానికి చెందిన వారసత్వ సంపద అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనం రాజకీయ పార్టీలుగా వేర్వేరు కావచ్చు..కానీ మనం అంతా ఒకే దేశ ప్రజలం, ఒకే సంస్కృతికి చెందిన వాళ్లమని’ పవన్ కళ్యాణ్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed