- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: హస్తినకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాసేపట్లో అమిత్ షా తో భేటీ!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇవాళ (బుధవారం) ఢిల్లీకి పయనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీ(Cabinet Meeting) ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 3.30 గంటలకు విమానంలో బయలుదేరి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి 6.30 నుంచి 7 గంటల వరకు ఆయనతో సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకుంటారు. ఓ అరగంట పాటు అక్కడ ఉండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ఏపీకి తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
Read More..
CM Chandrababu:పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు