Pithapuram: పిఠాపురం అభివృద్ధిపై పవన్ మాస్టర్ ప్లాన్

by Rani Yarlagadda |
Pithapuram: పిఠాపురం అభివృద్ధిపై పవన్ మాస్టర్ ప్లాన్
X

దిశ, వెబ్ డెస్క్: తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) పర్యటిస్తున్నారు. గొల్లప్రోలులో స్కూల్ విద్యార్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. అలాగే గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ.. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంను రాష్ట్రంలోనే అభివృద్ధిలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని ..పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి " పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ" పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా పేరు తెచ్చుకోవాలన్నారు. దీనికి ఇక్కడ ప్రజల సహకారం కూడా కావాలన్నారు. పాఠశాలలో పిల్లలకు మంచినీరు మరుగుదొడ్లు వంటి వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఎన్డీయే (NDA) భాగస్వామ్య నాయకులు కూడా కూడా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. పల్లె ప్రగతి లో భాగంగా 14 కోట్ల 40 లక్షల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టామని.. ఐదు కోట్ల 45 లక్షల రూపాయలతో కొత్త సిసి రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ.56 లక్షల అంచనా వ్యయంతో మంచినీటి వసతులకు కల్పనకు కేటాయించినట్లు పేర్కొన్నారు. దూడల సంతలో మౌలిక వసతులు కల్పనకు రూ.కోటి 30 లక్షలతో దూడల సంత ఆధునీకరణ పనులకు టెండర్లు, నవంబర్ నెలఖరులోగా ప్రారంభం పనులు, టిటిడి కళ్యాణమండపం భోజనశాలఅభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. రూ.24 లక్షలతో హాస్టల్స్ లో మౌలిక వసతులు కల్పన కు నిధులు మంజూరు చేసామని తెలిపారు. నాలుగు కోట్లతో వాగుపై బ్రిడ్జి నిర్మాణంకు నిధులు మంజూరు చేసామన్నారు. ఇంకా నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలను మంజూరైన నిధులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Advertisement

Next Story