ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణంపై విచారణ చేపట్టండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

by Jakkula Mamatha |   ( Updated:2024-12-29 14:57:34.0  )
ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణంపై విచారణ చేపట్టండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
X

దిశ,వెబ్‌డెస్క్: కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ చిరంజీవి చౌధరిని ఆదేశించారు. అంతేకాదు కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయం పై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ శ్రీ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావు తో ఫోన్లో మాట్లాడారు. యూనివర్సల్ బయో ఫ్యూయల్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య(air pollution) సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫలితంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్నాయని తేలింది. దీనిపై మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed