- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pithapuram: అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి.. పవన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీరియస్ గా స్పందించారు. క్రిమినల్స్ కు కులం, మతం అనేవి ఉండవని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని ఫైరయ్యారు. పిఠాపురం పర్యటనలో (Pawan in Pithapuram) ఉన్న ఆయన.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల్ని అరెస్ట్ చేయడంలో కులం అడ్డొస్తోందా ? నేరానికి పాల్పడిన వ్యక్తులను కులం చూసి వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది ? అని ప్రశ్నించారు. నిందితుల్లో తమ బంధువులున్నా సరే.. వాళ్లని మడతపెట్టి కొట్టాలన్నారు. నేరం చేసిన వారు బయట తిరుగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎస్పీలు, అధికారులు..రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
హోంమంత్రి అనిత (Vangalapudi Anitha)రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని సూచించారు. హోంశాఖ కూడా తానే తీసుకోవాల్సిందన్న పవన్.. తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారని, అధికారంలో ఉన్నాం కాబట్టే సైలెంట్ గా ఉంటున్నామని, లేదంటే తామేంటో చూపించేవారమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమది ప్రతీకార ప్రభుత్వం కాదు.. అలాగని చేతకాని ప్రభుత్వం కూడా కాదన్నారు. తామెవ్వరినీ వెనకేసుకు రావడం లేదని, పోలీసులు, అధికారులు కూడా నిందితుల్ని వెనకేసుకు రాకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read More : వ్యక్తిగత గేమ్స్ ఆడొద్దు.. కూటమి నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక
Ap News: హోంశాఖపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. స్పందించిన మాజీ మంత్రి రోజా