Pawan Kalyan:జాగిలంతో డిప్యూటీ సీఎం పవన్ క్యూట్ మూమెంట్స్

by Jakkula Mamatha |
Pawan Kalyan:జాగిలంతో డిప్యూటీ సీఎం పవన్ క్యూట్ మూమెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు (ఆగస్టు 15) 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పవన్ కళ్యాణ్ తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే జెండా ఆవిష్కరణకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కు పోలీసు జాగిలం పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికింది. ఈ సందర్భంగా పవన్ మోకాళ్ల పై కూర్చొని జాగిలం నుంచి బొకే తీసుకొని దానికి సెల్యూట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జాగిలంతో డిప్యూటీ సీఎం క్యూట్ మూమెంట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed