ఆ తింగరి మాటలే వద్దు.. పవన్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2023-12-30 12:10:29.0  )
ఆ తింగరి మాటలే వద్దు.. పవన్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పేదలందరికీ భూమి పేరుతో రూ. 35,141 కోట్ల మేర దోపిడి జరిగిందని, ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. దీంతో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మూర్తి స్పందించారు. ముందుగా పవన్ కల్యాణ్ సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. 35 వేల కోట్ల కుంభకోణం జరిగిందనడానికి పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్‌కు అసలు సిస్టమ్‌ అంటే ఏందో తెలియదన్నారు. చంద్రబాబు వద్ద ఉడిగం చేయడానికి పవన్ సిద్ధమయ్యారని విమర్శించారు. జగసేన అభ్యర్థులను గెలుపించుకోవాలనే ఆలోచన పవనకు లేదన్నారు. ఉదయం ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. సాయంత్రం చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకోవడమే పవన్‌కు తెలుసని ఎద్దేవా చేశారు. సభ్యత, సంస్కారం పవన్‌కు లేదని మండిపడ్డారు. 35 వేల కోట్ల స్కాం అంటే మాట్లాలా అని ప్రశ్నించారు. పవన్ తింగరి మాటలు మాట్లాడటం మానుకోవాలని డిప్యూటీ సీఎం గట్టు సత్యనారాయణ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed