- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: సనాతన ధర్మం పరిరక్షణకు ప్రత్యేక విభాగం: పవన్ సంచలన నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: సనాతన ధర్మం(Sanatana Dharma) పరిరక్షణకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Deputy CM, Janasena chief Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్వర్వంలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నరసింహ వారాహి గణం(Narasimha Varahi Ganam) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రకటించారు. సనాతన ధర్మం పరిరక్షణే ఈ విభాగం లక్ష్యమని తెలిపారు. ఏలూలు జిల్లా ఐఎస్ జగన్నాధపురం లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న పవన్.. సనాతన ధర్మం పరిరక్షణపై మాట్లాడారు. అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలని పవన్ సూచించారు. మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. అటు అభిమానులకు సైతం పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు. అభిమానులు సినిమా పేర్లు జపించడం కన్నా భగవన్నామస్మరణ చేస్తే మంచిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సలహా ఇచ్చారు.
కాగా సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో తెలిపారు. రాష్ట్రంలో హిందూదేవాయాలపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం(Tirumala Srivari Laddu Affair)లో జరిగిన ఘటనపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు జనసేన(Janasena) పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాట్లు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Read More : ఇకపై ఊరుకునేది లేదు.. మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్