- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US Election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగువారి ఆకాంక్షలు ఇవీ
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల(US presidential election) పోలింగ్ ఘట్టానికి ఇంకొన్ని గంటల సమయమే మిగిలింది. నవంబరు 5న అగ్రరాజ్యంలో ఓట్ల పండుగ జరగబోతోంది. డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి వనిత కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. ఈ ఎన్నికలు అమెరికాలో పుట్టి పెరిగిన అమెరికన్లకు ఎంత ముఖ్యమో.. భారత్ వంటి దేశాల నుంచి వెళ్లి అక్కడ ఉంటున్న వారికీ అంతే ముఖ్యం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది అమెరికాలో నివసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే వారిపై తెలుగువారు(Telugu People) బోలెడు అంచనాలు పెట్టుకున్నారు.
హెచ్-1బీ వీసా విధానాల్లో మార్పులతో..
చాలామంది తెలుగువారు అమెరికా ప్రభుత్వ హెచ్-1బీ వీసా విధానాల్లో మార్పులను కోరుకుంటున్నారు. హెచ్-1బీ వీసాల జారీని సులభతరం చేస్తే.. దాన్ని పొందే వ్యక్తి, అతడి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నేరుగా అమెరికాకు వెళ్లిపోవచ్చు. ఇంకా ఇతరత్రా అనుమతులు అవసరం ఉండవు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారికి తాత్కాలిక వర్క్ పర్మిట్‌ను మంజూరు చేసి ఆదుకోవాలని తెలుగువారు కోరుతున్నారు. గత నాలుగేళ్లలో అమెరికాలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయి. వాటిని కొత్త అధ్యక్షుడు నియంత్రణలోకి తేవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
తెలుగు సంప్రదాయాలను ప్రోత్సహించేలా..
ఇతర దేశాల యుద్ధాల్లో జోక్యం వల్ల అమెరికాకు నష్టమే తప్ప, లాభం జరగదని తెలుగువారు అభిప్రాయపడుతున్నారు. యుద్ధాలకు అమెరికాను దూరంగా ఉంచేలా కొత్త అధ్యక్షుడి విధానాలు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంస్కృతితో పాటు తెలుగు సంప్రదాయాలను ప్రోత్సహించేలా, మత విశ్వాసాలను గౌరవించేలా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేలా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగువారు ఆకాంక్షిస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భస్రావంపై బ్యాన్ విధిస్తారనే భయాలు ఉన్నాయని పలువురు చెప్పుకొచ్చారు.