వరద నష్టం అంచనాలు ఆలస్యం.. అధికారులపై చంద్రబాబు ఆగ్రహం

by M.Rajitha |
వరద నష్టం అంచనాలు ఆలస్యం.. అధికారులపై చంద్రబాబు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం వరద నష్టం అంచనాలపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంతమేరకు వరద నష్టంపై అంచనాలు పూర్తయ్యాయి అని సీఎం అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేక పోయారు. దీనిపై సీరియస్ అయిన సీఎం.. అంచనాలే త్వరగా ఇవ్వలేకపోతే ఇక బాధితులకు సరైన సమయంలో నష్టపరిహారం ఎలా అందిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి అయితేనే బాధితులకు సహాయం చేయగలమని.. కేంద్రానికి కూడా వరద నష్టం వివరాలు అందించాల్సి ఉంటుంది కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో రేపు సాయంత్రం వరకు వివరాలన్నీ తనకు సమర్పించాలని లేదంటే, కారణమైన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed