- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నా వైరస్ కారణంగా మృతి చెందే వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,635 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 12,561 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,48,608 చేరుకుంది. అయితే గత 24 గంటల్లో మహమ్మారి కారణంగా విశాఖలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,591 గా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,23,65,775 సాంపిల్స్‌ని పరీక్షించడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో వైరస్ ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ, కరోనా ఆంక్షలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.