Y. S. Jagan Mohan Reddy : సీఎం జగన్‌తో క్రికెటర్ అంబటి రాయుడు భేటీ

by Javid Pasha |   ( Updated:2023-06-08 12:29:37.0  )
Y. S. Jagan Mohan Reddy : సీఎం జగన్‌తో క్రికెటర్ అంబటి రాయుడు భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క్రికెటర్ అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, క్రికెటర్‌ అంబటి రాయుడు కలిశారు. ఈ సందర్భంగా సీఎస్‌కే టీంను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి అంబటి రాయుడు వివరించారు.

క్రీడారంగంపట్ల పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇటీవల ఐపీఎల్‌ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్ ట్రోఫీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు చూపించారు. ఈ సందర్భంగా సీఎస్‌కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి రూపా గురునాథ్, అంబటి రాయుడులు బహుకరించారు.

Read more :

అంబటి రాయుడుకు టీడీపీ గాలం.. గుంటూరు లోక్‌సభ స్థానం ఆఫర్?

Ambati Rayudu :మల్కాజిగిరి బరిలో స్టార్ క్రికెటర్..

Advertisement

Next Story

Most Viewed