- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగన్‌కు బిగ్ షాక్.. సీపీఐ సంచలన డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త అదానీ(Businessman Adani)పై అమెరికా(America)లో కేసులు నమోదైన వేళ రాష్ట్రంలోని సీపీఐ(Cpi) పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ ఒప్పందాల(Electricity contracts) విషయంలో గత ఏపీ ప్రభుత్వానికి ముడుపులు అందాయని సైతం ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI State Secretary Ramakrishna) కీలక డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అదానీ వ్యవహారంలో వైఎస్ జగన్(YS Jagan) సర్కార్‌కు ముడుపులు అందాయా లేదా అనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటు ప్రజలపై పడుతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సూచించారు. తనకు సంబంధంలేకుండా వైసీపీ మంత్రివర్గం విద్యుత్ ఒప్పందాలను ఆమోదించిందని మాజీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Former Power Minister Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. విజన్ 2047 విధానంపై మేధావులు, ప్రజలతో కూటమి ప్రభుత్వం సమగ్రంగా చర్చించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.