CPI Narayana: నిలదీయడం మానేసి చంద్రబాబు వేడుకుంటున్నారు

by Gantepaka Srikanth |
CPI Narayana: నిలదీయడం మానేసి చంద్రబాబు వేడుకుంటున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నారాయణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నిలబడిందని అన్నారు. అలాంటప్పుడు కేంద్రాన్ని రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో నిలదీయాల్సింది పోయి వేడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రభుత్వాలు మారినా అవినీతి మాత్రం అలాగే ఉందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఫైట్ చేస్తుంటే.. ప్యాకేజీల కోసం దొంగలు ఫైట్ చేస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. అదానీకి ఇనుప కవచంలా మోడీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని బీజేపీ వాడుకుంటోందని అన్నారు.

Advertisement

Next Story