జగన్‌కు పట్టిన గతే మీకూ పడుతుంది.. చంద్రబాబుకు సీపీఐ నారాయణ హెచ్చరిక

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-09 09:53:55.0  )
జగన్‌కు పట్టిన గతే మీకూ పడుతుంది.. చంద్రబాబుకు సీపీఐ నారాయణ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఏపీకి ఎంతో మేలు చేసినట్లు అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గొప్పలు చేప్పుకుంటోందని అన్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని సూచించారు. లేదంటే గత ముఖ్యమంత్రి జగన్‌కు పట్టిన గతే మీకూ పడుతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చింది అప్పు మాత్రమేనని.. ఏపీకి ఏదో ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అందంగా అబద్దాలు చెబుతున్నారని నారాయణ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాకపొతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. కేరళలోని వయనాడ్ విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story