Nandyala:చిన్నారి మృతదేహం 14 రోజులు జాడ ఎక్కడ..సీపీఐ డిమాండ్!

by Jakkula Mamatha |
Nandyala:చిన్నారి మృతదేహం 14 రోజులు జాడ ఎక్కడ..సీపీఐ డిమాండ్!
X

దిశ ప్రతినిధి,నంద్యాల:నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి గ్రామంలో వాసంతి అనే చిన్నారి ఎనిమిది సంవత్సరాల బాలికను జూలై 7వ తేదీన అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య కు సహకరించిన వారి తల్లిదండ్రులు బాలిక మృతదేహాన్ని కనపడకుండా చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించిన నేటి వరకు బాలిక మృతదేహం కనిపించకుండా పోవడం పోలీస్ శాఖ ఘోరంగా విఫలం కావడం జరిగిందన్నారు. వీరికి సహకరించారని నెపంతో విచారణ నిమిత్తం నిందితుల బంధువైన హుస్సేన్ మరణించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ముచ్చుమర్రి గ్రామంలో అసలు ఏం జరుగుతుందనే విషయం పై జిల్లా పోలీసులు సమగ్ర విచారణ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు.

కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. పి. సుంకయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే భాస్కర్, జిల్లా సమితి సభ్యులు, జి సోమన్న డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో చిన్నారి వాసంతి. పై అత్యాచారం. హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని బాలిక మృతదేహం 14 రోజులైనా నేటి వరకు కనిపెట్టడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.

అదే సందర్భంగా నిందితుల బంధువైన యోహాను ఉరఫ్ హుస్సేన్ అనే వ్యక్తి మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ముచ్చుమర్రికి చెందిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి సొంత గ్రామంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరు పోలీసుల విచారణకు అడ్డుపడే విధంగా ఉంటూ వాసంతి కేసును పక్క దోవ పట్టించే నీరుగార్చే విధంగా ఉందని అన్నారు. వాస్తవ సంఘటనలను వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాలిక మృతదేహం వెలికితీయడం, లాకప్ డెత్ ను సీబీసీఐడీతో విచారణ జరిపించి వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed