- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్ నిందితులను వెంటనే శిక్షించాలి.. సీపీఐ, డీహెచ్పీఎస్ డిమాండ్
దిశ, గొలుగొండ: మణిపూర్ గిరిజన మహిళలపై అత్యాచారం చేసిన మృగాలపై తక్షణమే ఉరిశిక్ష విధించాలని సీపీఐ, డీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ.. మణిపూర్ లో గిరిజన మహిళలను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటనపై గ సుప్రీంకోర్టు అగ్రహించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. మే 4వ తేదీన మహిళపై వివస్త్ర ఘటన జరిగితే 14 రోజులు వరకు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయకుండా ఎందుకంత నిర్లక్ష్యం చేశారో. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకుండా కాలయాపన చేస్తున్నారో దేశ ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఇటువంటి ఘటనలు జరుగుతుంటే స్త్రీ స్వేచ్ఛగా ఎలా జీవించాలనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ఇప్పటికైనా మహిళలు, ఇతర ప్రజానీకంఏకమై మతోన్మాద దాడులను, కులాధిపత్య దాడులను, దాన్ని ప్రేరేపించే బీజేపీ, ఆర్ఎస్ఎస్ గద్దె దింపేంతవరకు పోరాటాలు చేయాలన్నారు. మణిపూర్ ఘటన ప్రపంచ దేశాలు అంతా చాలా దారుణమని, వారిని కఠినంగా శిక్షించాలని చెబుతుంటే బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన రాజకీయ పార్టీలు మా ఇంట్లో జరగలేదు కదా అన్నట్లుగా వ్యవహరిస్తూ నోరు మెదపకుండా ఉండడం చాలా సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి పి.లోవరాజు, సీపీఐ కార్యవర్గ సభ్యులు జి.గురుబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు జి.రాధాకృష్ణ, సీపీఐ, డిహెచ్పీఎస్ కార్యదర్శిలు మేకా భాస్కరరావు, పి.కృష్ణ, గోల్కొండ సత్యనారాయణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.