మతోన్మాదంతో దేశాలు అభివృద్ధి చెందవు: సీపీఎం నేత బీవీ రాఘవులు

by Shiva |   ( Updated:2024-02-22 07:42:22.0  )
మతోన్మాదంతో దేశాలు అభివృద్ధి చెందవు: సీపీఎం నేత బీవీ రాఘవులు
X

దిశ, వెబ్‌డెస్క్: మతోన్మాదంతో దేశాలు అభివృద్ధి చెందవని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతాల ప్రాతిపదికన రాజకీయం చేసిన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి నేడు ఏవిధంగా ఉందో అందరికీ తెలుసని చురకలంటించారు. ప్రస్తుతం మన దేశంలో కూడా అచ్చం అలాంటి పరిస్థితే ఉందన్నారు. మత కార్యక్రమాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ తమ సొంత కార్యక్రమంగా చేపట్టిందంటూ ధ్వజమెత్తారు. ఏది ఏమైనా.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ టార్గెట్ అని బీవీ రాఘవులు అన్నారు.

Read More..

AP: గుడివాడ అమర్నాథ్ కు గుడ్లాభిషేకం చేసిన విద్యార్థులు.. కారణం ఇదే..

Advertisement

Next Story