- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఆ జిల్లాలో కార్డన్ సెర్చ్.. తనిఖీల్లో వందలాది మంది పోలీసులు..
దిశ ప్రతినిధి, అనకాపల్లి: ఈ రోజు (శుక్రవారం) ఉదయం అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం మండలం లోని గురందొర పాలెంలో పోలసులు కార్డన్ సర్చ్ ను నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో వందలాది మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా గ్రామంలోకి చేరుకోవడంతో గ్రామంలో ఏం జరుగుతుందో అర్ధంకాక గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సర్చ్ కార్యక్రమం దాదాపుగా రెండు గంటల పాటు జరిగింది. ఈ క్రమంలో బయట వ్యక్తులను గ్రామంలోని అనుమతించలేదు. అదేవిధంగా గ్రామస్తులను బయటకు వెళ్లనీయలేదు.
గతంలో ఈ గ్రామం నుంచి గంజాయి, ఇతర కేసుల్లో ఉన్న వారి ఇళ్లను క్షుణ్ణంగా సోదాలు చేశారు. అదేవిధంగా గ్రామంలోని అన్ని వాహనాలకు సంబంధించి రికార్డులు పరిశీలించి, లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా సారా తయారీకి వినియోగించే పాత్రలను సైతం సీజ్ చేశారు. ఈ సందర్బంగా డీఎస్పీ మోహనరావు మాట్లాడుతూ గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం తెలియడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 160 మంది సివిల్, రైల్వే పోలీసులు పాల్గొన్నట్టు వెల్లడించారు. వీటితో పాటు పోలీస్ డాగ్స్ ను వినియోగించినట్టు పేర్కొన్నారు.