- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఎక్కించేందుకు కుట్రలు : Nara Lokesh
దిశ , డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితులుపై ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో చంద్రబాబు నాయుడు ప్రాణానికి తక్షణ ముప్పు ఉంది అని ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జైల్లో చంద్రబాబు నాయుడుకు భద్రత లేదని లోకేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడుకు జైల్లో స్టెరాయిడ్లు ఎక్కించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం, జైలు అధికారులు ఏదో దాస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. అందువల్లే చంద్రబాబు నాయుడు హెల్త్ కండీషన్స్‌పై వాస్తవాలు బయట పెట్టడం లేదని లోకేశ్ తెలిపారు. చంద్రబాబు నాయుడుకు ఏదైనా హాని జరిగితే సీఎం వైఎస్ జగన్‌దే బాధ్యత అని లోకేశ్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు జైల్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో ప్రభుత్వం కుట్రలు చేస్తోందని లోకేశ్ ఆరోపించారు. జైల్లో చంద్రబాబు నాయుడుకు సరైన భద్రత లేదని ఆయన ప్రమాదంలో ఉన్నారని లోకేశ్ అన్నారు. కలుషిత నీరు, స్కిన్ అలర్జీ,దోమలు, బరువుతు తగ్గడం, ఇన్ఫెక్షన్స్‌తో చంద్రబాబు నాయుడు బాధపడుతున్నా కనీసం సకాలంలో వైద్యం అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది అని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.