- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధాని తరలింపు పిచ్చి తుగ్లక్ చర్య : తులసిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : రాజధాని తరలింపు అంశంపై ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ఘాటుగా స్పందించారు. రాజధానిని విశాఖకు తరలిస్తే రాయలసీమకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గురువారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రిక తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇది పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. పంటి నొప్పికి తుంటిమీద తన్నినట్లుంది అని మూడు రాజధానుల అంశంపై మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా తెప్పించాలి అని సూచించారు. బుందేల్ ఖండ తరహా ప్రత్యేక ప్యాకేజీ తెప్పించాలి అని కోరారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో రైల్, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను తెప్పించాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకుండా చూసే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రస్తుత రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని.. 2022 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కాబట్టి రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు.