ఏపీపై కాంగ్రెస్ ఫోకస్.. 25 మందికి కీలక బాధ్యతలు

by srinivas |   ( Updated:2024-01-07 13:58:22.0  )
ఏపీపై కాంగ్రెస్ ఫోకస్.. 25 మందికి కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఆరు గ్యారంటీల హామీలతో మిగిలిన రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. ఏపీకి సైతం సమన్వయకర్తలను ప్రకటించింది. మొత్తం 25 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.

నియోజకవర్గాల సమన్వయకర్తలు వీరే...

1. అరకు (ఎస్టీ)-జగత శ్రీనివాస్

2. శ్రీకాకుళం-మీసాల సుబ్బన్న

3. విజయనగరం -బొడ్డేపల్లి సత్యవతి

4. విశాఖ పట్నం-కొత్తూరి శ్రీనివాస్

5. అనకాపల్లి-సనపల అన్నాజిరావు

6. కాకినాడ-కేబీఆర్ నాయుడు

7. అమలాపురం (ఎస్సీ)-ఎమ్. వెంకట శివ ప్రసాద్

8. రాజమంద్రి- ముషిని రామకృష్ణ

9. నర్సాపురం-జెట్టి గురునాథరావు

10. ఏలూరు - కె. బాపిరాజు

11. మచిలీపట్నం-కొరివి వినయ్ కుమార్

12. విజయవాడ- డి. మురళీ మోహన్ రావు

13. గుంటూరు-గంగిశెట్టి ఉమామహేశ్వరరావు

14. నరసరావుపేట-వి.గురునాథం

15. బాపట్ల-శ్రీపథి ప్రకాశం

16. ఒంగోలు-యువ్ వెంకటరావు యాదవ్

17. నంద్యాల- బండి జకారియా

18. కర్నూలు-పీఎమ్ కమలమ్మ

19. అనంతపురం-శ్రీహరి ప్రసాద్

20. హిందూపురం- షేక్ సత్తార్

21. కడప-ఎమ్. సుధాకర్ బాబు

22. నెల్లూరు-ఎమ్. రాజేశ్వరరావు

23. తిరుపతి ఎస్సీ- షేక్ నజీర్ అహ్మద్

24. రాజంపేట-ఎన్. తులసిరెడ్డి

25. చిత్తూరు- రామ్ భూపాల్ రెడ్డి



Advertisement

Next Story