- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Political News: మహిళకు శుభవార్త చెప్పిన కాంగ్రెస్.. ఏంటంటే..?
దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల్లో కాగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. తాము అధికారంలోకి వస్తే పలు సంక్షేమ కార్యకలాపాలు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తోంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. తమ పార్టీ అధికారంలోకి రాగానే పేద కుటుంబంలోని ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది.
అలానే మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. మహిళల సంక్షేమంకోసం నారీ న్యాయ్' పేరిట మహిళలకు ఐదు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా దేశంలోని మహిళల వృద్ధి కోసం 'నారీ న్యాయ్' పేరిట కొత్త అజెండాను తీసుకురాబోతున్నామని ఖర్గే పేర్కొన్నారు.
కాగా తాము కేవలం హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే చేతులు దులుపుకునే బ్యాచ్ కాదని తెలిపారు. 1926 నుంచి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కి ఉందని తెలిపారు. తాము ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు అందించి.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండని ప్రజలను ఖర్గే కోరారు.