Posani : పోసోని కృష్ణ మురళిపై జనసేన నేతల ఫిర్యాదు

by Y. Venkata Narasimha Reddy |
Posani : పోసోని కృష్ణ మురళిపై జనసేన నేతల ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీసీ సోషల్ మీడియా దాడికి కళ్లెం వేస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను ఒక్కొక్కరిని అరెస్టు చేస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ(YCP) సీనియర్ నాయకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి జన సేన(Janasena) పార్టీ లీగల్ సెల్ నాయకులు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో రోడ్ల బాగు కోసం గాంధీ జయంతి రోజున శ్రమదానం చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పోసోనిపై చట్ట పర చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ సెల్ నాయకులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

వైసీపీ సీనియర్ నాయకుడైన పోసోని కృష్ణ మురళి శ్రమదానం కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్ర చేశారని, అందుకే పవన్ కల్యాణ్ పైన, కుటుంబ సభ్యులపైన, జనసేన కార్యకర్తలపైన, వీర మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజమండ్రిలో నమోదైన పెండింగ్ కేసులోనూ పోసానిపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని ఎస్పీని జనసేన లీగల్ సెల్ నాయకులు కోరారు.

Advertisement

Next Story