ఎమ్మెల్యే వంశీ, అనుచరులపై ఫిర్యాదు

by Mahesh |
ఎమ్మెల్యే వంశీ, అనుచరులపై ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, ఆయన అనుచరులపై తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కల్యాణి డీజీపీ కార్యాలయంలో, స్థానికి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను, తన కుటుంబంపై వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, ప్రాణహాని కల్గించేలా బెదిరిస్తున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు సామాజిక మాధ్యమాల ద్వారా తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, ప్రాణహాని కల్గించేలా భయపెట్టడం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు, రాచేటి రూతమ్మ, ఓలుపల్లి రంగా, వెలగపల్లి ప్రదీప్‌లు ద్వేషపూరితంగా, నేర పూర్వకంగా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి, యార్లగడ్డ సూచిత్ర, ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా నాయకురాలు, వడ్డీ వాసవి మరియు స్థానిక నాయకులతో కలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో, వ్యక్తిగతంగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story