ఆస్పత్రిలో 12 అడుగుల కోబ్రా హల్ చల్.. భయంతో బయటకు పరుగు తీసిన రోగులు

by srinivas |
ఆస్పత్రిలో 12 అడుగుల కోబ్రా హల్ చల్.. భయంతో బయటకు పరుగు తీసిన రోగులు
X

దిశ, వెబ్ డెస్క్: 12 అడుగుల కోబ్రా ఆస్పత్రిలోకి వచ్చింది. సమీప అటవీ ప్రాంతం నుంచి రాత్రి సమయంలో ఆస్పత్రి రూమ్‌లోకి వచ్చింది. బయటకు వెళ్లేందుకు అటూ ఇటూ తిరిగింది. అయితే బయటకు వెళ్లే దారి లేక అక్కడే ఉండిపోయింది. ఈ ఉదయం కోబ్రాను గమనించిన రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం జెన్‌కో ఆస్పత్రిలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కోబ్రాను పట్టుకుని సమీప అటవీ ప్రాంతలో వదిలివేశారు. అయితే ఆస్పత్రిలోకి నిత్యం పాములు వస్తున్నాయని, మండలంలో స్నేక్ కేచర్ ను నియమించాలని స్థానిక ప్రజలు, రోగులు కోరుతున్నారు.

Next Story

Most Viewed