జగ్జీవన్ రామ్‌కు సీఎం జగన్ నివాళి

by srinivas |
జగ్జీవన్ రామ్‌కు సీఎం జగన్ నివాళి
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి తన నివాసంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. మరోవైపు దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు కాలువ శ్రీనివాసులు, మాజీమంత్రి పరిటాల సునీత, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.



Advertisement

Next Story