చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-22 07:16:18.0  )
చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నంలో బందర్ పోర్ట్ నిర్మాణ పనుల అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. టీడీపీకి తోడు గజదొంగలు ముఠా సభ్యులు, దత్తపుత్రుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అమరావతిలో పాచిపని చేసేవాళ్లు ఉండకూడదనేది చంద్రబాబు ఆలోచన అన్నారు. 50వేల మంది నిరుపేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం ప్రారంభిస్తే దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నానన్నారు. అమరావతిలో 26న పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామన్నారు. పేదలంటే చంద్రబాబుకు చులకన అన్నారు.

Read More: త్వరలో రిటైర్మెంట్.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story