YS Jagan Mohan Reddy : సలహాదారులకు సీఎం జగన్ తీపికబురు

by Nagaya |   ( Updated:2023-06-15 09:33:44.0  )
YS Jagan Mohan Reddy : సలహాదారులకు సీఎం జగన్ తీపికబురు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంలోని సలహాదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు చెప్పారు. సలహాదారుల పదవీకాలాన్ని మరోసారి పొడిగించారు. సజ్జల రామకృష్ణారెడ్డి,జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్‌ల పదవీకాలాన్ని మరోసారి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వీరు మరో ఏడాది పాటూ సలహాదారులుగా పనిచేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురిని సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది. శాఖలవారీగా సలహాదారుల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే కోర్టులో విచారణ సైతం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ నలుగుర్ని మరో ఏడాది పాటూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story