ఇల్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఎప్పుడు ఇస్తారంటే..?

by Indraja |
ఇల్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఎప్పుడు ఇస్తారంటే..?
X

దిశ వెబ్ డెస్క్: నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో చేనేతలతో సమావేశం అయ్యారు. ఈ సామావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో 54వేల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చెయ్యగా. వాటిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎలాగైతే సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరో అలానే పేదల జీవితాలు బాగుపడటాన్ని కూడా ఎవరూ ఆపలేరని తెలిపారు.

మళ్ళీ అధికారంలోకి రాగానే అందరికీ ఆ స్థలాలే ఇప్పిస్తామని తెలిపారు. ఏదైనా అనివార్య కారణాల చేత మీ బిడ్డ ఇచ్చిన మాట నెరవేర్చలేక పోతే.. ఆరు నెలల తరువాత కొత్త స్థలాలను కొని పేదలకు అందిస్తా అని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story