ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-15 10:32:33.0  )
Ys Jagan
X

దిశ, వెబ్‌డెస్క్: ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల నోటిఫికేషన్ ముందే వస్తుంది. 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మంత్రులంతా మరింత కష్టపడి పనిచేయాలన్నారు. ఎన్నికలకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధంగా ఉందన్నారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని కేబినెట్ భేటీలో సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed