- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
YS Jagan Mohan reddy :రేపు తెనాలికి సీఎం జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతుల అకౌంట్లో సీఎం జగన్ నేరుగా నగదు జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి సీఎంవో కార్యాలయం పర్యటన వివరాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
మంగళవారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. 10.35 గంటలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుని నాలుగో ఏడాది మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ప్రకటనలో స్పష్టం చేసింది. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మరోవైపు సభను విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం, ఇటు వైసీపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.