- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేనిఫెస్టోలో కోతలు.. ఆపై కోటయ్య కమిటీలు.. జగన్
దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారు. ఓ వైపు పార్టీ కార్యక్రమాలు, మరో వైపు ప్రభుత్వ కార్యకలాపాలు, ఇంకో వైపు ప్రయివేట్ కార్యక్రమాలతో ప్రతినిత్యం బిజీ బిజీగా గడుపుతున్న జగన్.. పార్టీ ప్రచారాల్లో జోరుగా పాల్గొంటున్నారు. అలానే భహిరంగ సభల్లో తమవల్ల మంచి జరిగిందని నమ్మితే మరో అవకాశం ఇవ్వమని ప్రజలను అడుగుతూనే.. విపక్షాల పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.
తాజాగా వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుకి ఓటు వేస్తే సంక్షేమ పధకాలు ఆగిపోతాయని పేర్కొన్న ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని చెప్పాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక రైతులు బాబును నమ్మడం అంటే నిలువునా మునగడమే అని ఎద్దేవ చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో తో కోతలు కోస్తారని.. ఆ తరువాత కోటయ్య కమిటీలు వేస్తారని వెల్లడించారు.