Breaking: ఎన్నికల్లో డబ్బులు పంచితే తీసుకోండి.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్

by Indraja |   ( Updated:2024-04-13 15:18:57.0  )
Breaking: ఎన్నికల్లో డబ్బులు పంచితే తీసుకోండి.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.తాజాగా భహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నారా లోకేష్ డబ్బులు పంచినట్టు మంగళగిరి వైసీపీ అభ్యర్థి లావణ్య పంచలేదు. ఎందుకంటే.. నారా లోకేష్ దగ్గర ఉన్నట్టు, లావణ్య దగ్గర డబ్బులు లేవు అని పేర్కొన్నారు.

చేనేతలతో ముఖాముఖీలో పాల్గొన్న నారా లోకేష్ ఓటుకు 6 వేలు పంచుతాడు అని ఆరోపించారు. అయితే ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి, వద్దనవద్దు అని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. కానీ.. ఓటు వేసే ముందు ఆలోచించండి అని తెలిపారు.

జూన్, జులైల్లో అమ్మఒడి, చేయూత, నేతన్న నేస్తం ఎవరు ఇస్తారో, ఇస్తున్నారో వారికి మీ ఓటు వేయండి అని ప్రజలకు సూచించారు. ఎవరు అధికారంలో ఉంటే మన పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందుతుందో ఆలోచించి వారికే ఓటు వేయండి అని ప్రజలను సీఎం జగన్ కోరారు.

Read More...

ఇల్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఎప్పుడు ఇస్తారంటే..?

Advertisement

Next Story