- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ రాజధానిపై బిగ్ స్కెచ్.. ఎన్నికల ముందు అసలు విషయం బయటపెట్టిన సీఎం జగన్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టారు. మూడు రాజధానులు అంటూనే అయన మనసులోని మాటను చెప్పేశారు. విశాఖ పాలన రాజధాని అంటూనే అసలు విషయం చెప్పారు. అమరావతిలో రాజధాని అభివృద్ధికి కోట్లు ఖర్చు అవుతాయని, విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఓ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ అమరావతిలో ఎకరా డెవలప్ మెంట్ రూ. 2 కోట్లు అవుతాయని, విశాఖలో ఉన్న సదుపాయాలు రాష్ట్రంలో ఎక్కడా లేవని సీఎం తెలిపారు.
తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో.. ఏపీకి విశాఖ ఐకాన్ సిటీ అని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణలో 60 శాతం రెవెన్యూ హైదరాబాద్‌పైనే వస్తుందన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు విశాఖ కాంపిటీషన్ అని పేర్కొన్నారు. ముంబై మాదిరిగా శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శ్రీకాకుళంలో పోర్టు కడుతున్నామన్నారు. తాను అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని తెలిపారు.రాష్ట్రంలో విశాఖ అతిపెద్ద పట్టణమని చెప్పారు. విశాఖలో భారీ స్థాయిలో సచివాలయం నిర్మిస్తామని తెలిపారు. భారీ కన్వెన్షన్ హాల్, స్టేడియం కడతామని వెల్లడించారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని, బూస్టింగ్ ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే బాగా లేట్ అవుతుందని, వీలైనంత త్వరగా హైదరాబాద్, చెన్నై స్థాయికి ఎదగాలని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చాలా చేశామని చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, చంద్రబాబు 32 వేలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. వైద్య రంగంలో 54 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.