- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. కాసేపట్లో ప్రధానితో సమావేశం
దిశ, వెబ్ డెస్క్: కేంద్రహోంమంత్రి అమిత్ షాని సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. ఢిల్లీలోని హోంమంత్రి కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్.. నేరుగా అమిత్ షాతో భేటీ అయి చర్చించారు. వీరి భేటీ దాదాపు 45 నిమిషాలకు పైగా సాగింది. ఏపీకి సంబంధించిన పలు విషయాలపై వీరిద్దరూ చర్చించారు. భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే మరికాసేపట్లో ప్రధాని మోదీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన వంటి సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్రమంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.
మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారని.. కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
Read More..
కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ.. పరిశీలనలో ఆ ముగ్గురు ఎంపీల పేర్లు?