- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ మరో డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ విమర్శలు కురిపించారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలపై ట్విట్టర్ వేదికగా ఆయన రోజూ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల ఉచిత పంట చెల్లింపులపై జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించలేదన్నారు. దాంతో రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలలో చెల్లించేవాళ్లమని గుర్తు చేశారు. అంతేకాదు నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నామని తెలిపారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదలచేస్తుందని తెలిపారు. ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందన్నారు. అదే మాదిరిగా తమ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు అందించి వారికి అండగానిలిచామని చెప్పారు. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని జగన్ తెలిపారు.
‘‘అయితే 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికి జూన్, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలి.’’ అని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు.
.@ncbn … 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 11, 2024
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలలో చెల్లించి…