- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీది ఆ రెండు రాష్ట్రాల కాపీ మేనిఫెస్టో: CM జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లాలోని మేదరమట్లలో ఆదివారం వైసీపీ సిద్ధం బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు హాజరైన జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు కిచిడీ వాగ్దానాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు వాగ్ధానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదని సెటైర్ వేశారు. చంద్రబాబు కర్నాటక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టో కాపీ కొట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 7 హామీలకు ఏటా రూ.87.312 కోట్లు కావాలని.. ఇంత డబ్బును ఎక్కడ నుండి తీసుకొస్తారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసేందుకే ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇస్తారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు చెప్పే అబద్ధాలకు హద్దే ఉండదని.. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బాబు సిద్ధం అవుతున్నారని విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబుది అబ్ధదాలు చెప్పే సిద్ధాంతం అని.. ఆయన హామీలు నమ్మితే మోసపోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు వస్తే ప్రస్తుతం అమలు అవుతోన్న సంక్షేమ పథకాలు అన్నీ రద్దు అవుతాయని.. మళ్లీ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తేనే ఈ పథకాలు కొనసాగుతాయని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వస్తే పథకాల రద్దు తప్పదని హెచ్చరించారు. బాబు మాయ మాటలు నమ్మి మోసపోకుండా.. మరోసారి వైసీపీని ఆశీర్వదించాలని జగన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.