ఏప్రిల్ ఫూల్ చేసిన CM జగన్.. జనసేన ట్వీట్ వైరల్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-02 12:31:18.0  )
ఏప్రిల్ ఫూల్ చేసిన CM జగన్.. జనసేన ట్వీట్ వైరల్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్ ఫస్ట్‌ను పొలిటికల్ పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలకు గట్టిగా వాడేస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ వాగ్ధానాలపై ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. 2019 ఎన్నికలకు ముందు రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వమే వస్తుందని అప్పుడు మద్యపానాన్ని నిషేదిద్దాం.. అని జగన్ ఉన్నట్లు ఓ వీడియోను ఎడిట్ చేసింది. ఈ వీడియోలో మరోసారి సీఎం జగన్ 2024లో ఎన్నికల నాటికి మద్యపానాన్ని కేవలం 5 స్టార్ హోటల్స్‌కు పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామన్నారు. మెగా డీఎస్సీ, 25 ఎంపీ స్థానాలు గెలిస్తే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడదాం వంటి హమీలన్నింటిని మిక్స్ చేసి ఏప్రిల్ ఫూల్ ఫీట్.. బై వైఎస్ జగన్ అని కామెంట్ పెట్టింది. సీఎం జగన్‌పై జనసేన పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

BIG BREAKING: పార్లమెంట్ ఎన్నికల బరిలో షర్మిల.. సోదరుడిపై ఎంపీగా పోటీ

Advertisement

Next Story