- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యారంగంలో మార్పులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, పేదలు ఓవైపు.. పెత్తందార్లు మరోవైపు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. తన 58 నెలల పాలనలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారని, వాళ్లను ఓడించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. విద్యారంగాల్లో చాలా మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ధనికులకు అందే చదవులను పేదలకు అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు చేశామన్నారు. ఇంగ్లీష్ మీడియంతో పాటే సీబీఎస్ఈని తీసుకొస్తున్నామని తెలిపారు.16 ఏళ్ల తర్వాత పేద బిడ్డల భవిష్యత్తు కోసమే ఇప్పుడు బడుల్లో మార్పులు జరుగుతున్నాయన్నారు. విద్యారంగాన్ని విస్మరించిన చంద్రబాబుకు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. మీ ఓటుతోనే పిల్లల భవిష్యత్తు మారుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Read More..