- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్యాకేజీ స్టార్‌ది సిట్ అండ్ స్టాండ్ విధానం’.. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ విమర్శల వర్షం కురిపించారు. ఆదివారం వైసీపీ బాపట్ల జిల్లాలోని మేదరమట్లలో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు సైకిల్‌కు చక్రాలే లేవు.. అది తుప్పు పట్టిన సైకిల్ అని సెటైర్ వేశారు. తుప్పుపట్టిన సైకిల్ తొక్కడానికి, తోయడానికి ఆయనకు వేరే పార్టీలు అవసరం అయ్యాయని ఎద్దేవా చేశారు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి చంద్రబాబు ఒక దత్తపుత్రుడని తెచ్చుకున్నాడని పవన్‌ను విమర్శించారు. ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ వాళ్ల గురువు ముందు ఎప్పుడూ నోరెత్తడని అన్నారు. సిట్ అంటే కుర్చుంటాడు.. స్టాండ్ అంటే నిలబడతాడు అని సెటైర్ వేశారు.
పొత్తులో ఉండాలన్నా, విభేదించాలన్నా పవన్ కల్యాణ్ డ్రామాలు ఆడుతాడని మండిపడ్డారు. నాపై అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి.. ప్రజలు దేవుడిని తప్ప పొత్తులు, ఎత్తులను నమ్ముకోలేదని స్పష్టం చేశారు. ఒంటరిగా ఇన్నాళ్లు సింహంలా అందరికీ తోడుగా ఉన్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరినీ మోసం చేయలేదు.. అబద్ధం చెప్పలేదన్నారు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తాం.. అందులో చేయగలిగిందే చెబుతామని క్లారిటీ ఇచ్చారు. జగన్ మాట ఇస్తే తగ్గేదేలే దన్నారు. అధికారం పోతుందని భయం మాకు ఎప్పుడూ లేదని తేల్చి చెప్పారు. పేదల భవిష్యత్ బాగుపడాలంటే మళ్లీ వైసీపీనే రావాలని జగన్ ఆకాంక్షించారు.