- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ రాజధానిగా విశాఖ.. తేల్చి చెప్పిన సీఎం జగన్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రాజధాని విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖ పట్టణం ఉంటుందని.. తాను గెలిచిన తర్వాత విశాఖలోనే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని.. విశాఖలోనే ఉంటానని అన్నారు. అంతకు ముందు.. రాష్ట్ర విభజన కారణంగా కీలకమైన కంపెనీలు 90శాతం హైదరాబాద్ లోనే ఉండిపోయాయని అన్నారు. అలాగే రానున్న కాలంలో తాను మరోసారి సీఎంగా వచ్చి విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లా మారుస్తామని, విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక నా వ్యక్తిగత స్వార్ధమేమి లేదని చెప్పుకొచ్చారు. అలాగే అమరావతిని తిరిగి రాజధానిగా ఏర్పాటు చేయాలంటే లక్ష కోట్లు అవసరం అన్నారు. కానీ విశాఖలో ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. అందుబాటులో ఉన్న సదుపాలను కాస్త మెరుగుపరిచి విశాఖను అద్బుతమైన పాలనా రాజధానిగా చేయవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. దీంతో పాటుగా తాను రాష్ట్రంలో అమరావతి సహా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, అందుకు అమరావతిని ఏపీ రాజధానిగా ఉంచామని చెప్పుకొచ్చారు.
Read More..
అధికారాన్ని ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థి..ఇబ్బందిపడిన విద్యార్థులు