- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొన్నూరు సభలోనూ సేమ్ టు సేమ్.. గేర్ మార్చాలంటున్న విశ్లేషకులు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మళ్లీ విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా పొన్నురులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన చంద్రబాబుకు ఓటు వేస్తే తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారని చెప్పారు. వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. అటువైపు కౌరవ సైన్యం ఉందని, వారికి అందర్నీ మోసం చేసిన చరిత్ర ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు రెండు పార్టీలు మద్దతుగా నిలిచాయన్నారు. ప్రజలతోనే తనకు పొత్తు అని చెప్పారు. రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని, పేదల తలరాతను నిర్ణయిస్తాయని చెప్పారు. చంద్రబాబు తనను పిల్ల బచ్చా అని అంటున్నారని, పోయే కాలం వస్తే విలన్లకు హీరో పిల్ల బచ్చాలాగే కనిపిస్తారని కౌంటర్ ఇచ్చారు. పిల్ల బచ్చాను ఢీకొట్టేందుకు ఇన్ని పార్టీలు కలిసి రావాలా అని జగన్ ప్రశ్నించారు.
పేదల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే మరో అడుగు ముందుకు వేసి 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసినట్లు జగన్ తెలిపారు. తాను చేసిన మంచిని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తన కేబినెట్‌లో 68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని జగన్ తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ప్రజలకేమీ చేయలేదన్నారు. 2014లో ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారా అని నిలదీశారు. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశారా..? రైతులకు రుణమాపీ చేశారా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అనేది ఆయన విడుదల చేసే మేనిఫెస్టో చెబుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం ఉందా అని జగన్ ప్రశ్నించారు.
అయితే సీఎం జగన్ చేసిన ప్రసంగాల్లో పస లేని, ఆకట్టుకునేలా లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతీ చోట చంద్రబాబుపైనే విమర్శలు చేస్తున్నారని, ప్రజలు పట్టిచుకోవడం లేదని చెబుతున్నారు. ఇకనైనా ప్రజలను ఆక్టుకునేలా ప్రసంగాలు చేయాలని సూచిస్తున్నారు.