Cm Jagan: ‘ప్రారంభించింది ఆయన.. పూర్తి చేసేది నేను’.. పోలవరంపై అసెంబ్లీలో కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2023-03-23 14:42:31.0  )
Cm Jagan: ‘ప్రారంభించింది ఆయన.. పూర్తి చేసేది నేను’.. పోలవరంపై అసెంబ్లీలో కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడారు. పోలవరం గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని ఆయన అన్నారు. 2004లో పోలవరం ప్రాజెక్టుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. 2004కు ముందు 9 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు పోలవరం పేరును సరిగ్గా పలకడం కూడా రాదని ఎద్దేవా చేశారు. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం అని సీఎం జగన్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డినే పోలవరాన్ని ప్రారంభించారని.. దాని పూర్తి చేసేది ఆయన కుమారుడేనని ధీమా వ్యక్తం చేశారు. దోచుకో, పంచుకో, తినుకో అనే విధంగా చంద్రబాబు పాలన జరిగిందని విమర్శించారు. పోలవరం డబ్బులను ఏటీఎంలా వాడుకున్నారని, స్వయంగా కేంద్రమే తెలిపిందని సీఎం జగన్ గుర్తు చేశారు.

Also Read...

Mlc Elections: విజయవాడ, హైదరాబాద్‌లో భారీగా బెట్టింగులు

Advertisement

Next Story